News November 20, 2024
మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

TG: మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏడాదిలో రూ.25వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు నిన్న వరంగల్ సభలో వెల్లడించారు. ఈ రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు.
Similar News
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<
News September 18, 2025
త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్: CEA

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.