News October 21, 2024
సేవింగ్స్ ఖాతాలపై బ్యాంకుల వడ్డీ రేట్లు ఇలా..

IDFC బ్యాంక్: రూ.5లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3% వడ్డీ, రూ.5 లక్షల- రూ.100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే అత్యధికంగా 7.25% వడ్డీ అందిస్తోంది.
HDFC, ICICI: రూ.50 లక్షల లోపు 3% వడ్డీ, ఆపై బ్యాలెన్స్ ఉంటే 3.5% వడ్డీ అందిస్తున్నాయి.
SBI: రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్‌పై 2.70 %, ఆపై ఉంటే 3% వడ్డీ అందిస్తోంది
PNB: రూ.10 లక్షల లోపు బ్యాలెన్స్‌కు 2.70%, రూ.10 లక్షల- రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75% చెల్లిస్తుంది.
Similar News
News February 9, 2026
హెల్తీ డైట్.. ఈ 5 తప్పులు చేయవద్దు!

ఆరోగ్య కోసం హెల్తీ డైట్ తినేవాళ్లు కొన్ని మిస్టేక్స్ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని డైటీషియన్స్ అంటున్నారు. కొన్ని ఫుడ్స్ పట్ల మరీ కఠినంగా ఉండడం వల్ల క్రేవింగ్స్ పెరిగి ఒకేసారి ఎక్కువ తినే ప్రమాదం ఉంది. అపోహలతో కొన్ని పోషకాహారాలకు దూరంగా ఉండటం, అన్‌హెల్తీ ఫుడ్‌ను దగ్గరగా ఉంచుకోవడం, రాత్రి పొద్దుపోయాక తినడం, ఫుడ్ ఇన్‌టేక్‌ను ట్రాక్ చేయకపోవడం వంటివీ డైట్ ప్లాన్‌ను పూర్తిగా పాడుచేస్తాయి.
News February 9, 2026
5 పరుగుల తేడాతో 6 వికెట్లు డౌన్!

T20WC: స్కాట్లాండ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఇటలీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 134 రన్స్‌కే ఆలౌటైంది. 129-134 రన్స్ మధ్య 6 వికెట్లు కోల్పోవడం ఓటమికి ప్రధాన కారణమైంది. మరోవైపు ఓపెనర్లు సైతం శుభారంభం అందించలేదు. బెన్ మనేంటి ఒక్కరే హాఫ్ సెంచరీ(52)తో రాణించారు.
News February 9, 2026
RSS కృషి వల్లే BJP ఎదిగింది: మోహన్ భాగవత్

సంఘ్ కార్యకర్తలు చేసిన నిరంతర కృషి, సైద్ధాంతిక నిబద్ధత వల్లే ‘అచ్చే దిన్’ వచ్చాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినందుకు కాదన్నారు. దశాబ్దాల సంఘ్ సైద్ధాంతిక కృషి వల్లే బీజేపీ ఎదిగిందని పేర్కొన్నారు. మోదీ ప్రధాని కావడానికి సంఘ్ కృషే కారణమని చాలా మంది నమ్ముతారన్నారు. అయితే BJP ఒక స్వతంత్ర రాజకీయ సంస్థగా తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.


