News October 1, 2024
ఎన్టీఆర్-ప్రశాంత్ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ న్యూస్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న యాక్షన్ ఫిల్మ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం బంగ్లాదేశ్ బ్యాక్డ్రాప్లో సాగుతుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హీరోయిన్గా రష్మిక నటించనున్నారని, ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ హైలైట్గా నిలిచేలా కథ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
Similar News
News November 21, 2025
వరంగల్: భారీగా పడిపోతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మొక్కజొన్న ధర భారీగా పడిపోతోంది. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర ఈవారం మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం రూ.2,080 ఉన్న మొక్కజొన్న ధర, బుధవారం రూ.2,030కి పడిపోయింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,010 అయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే మార్కెట్లో కొత్త తేజ మిర్చికి రూ.15,021 ధర రాగా, దీపిక మిర్చికి రూ.16 వేల ధర వచ్చింది.
News November 21, 2025
టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
News November 21, 2025
కొత్త లేబర్ కోడ్లో ఉపయోగాలు ఇవే..

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్లు
* ఫిక్స్ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి


