News September 16, 2024
మహేశ్-రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సూపర్ స్టార్ మహేశ్, SS రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న ‘SSMB29’పై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమాపై ఏ అప్‌డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మూవీ స్టోరీ 1800వ శతాబ్దంలో నడుస్తుంది. ఆ సమయానికి చెందిన ఓ గిరిజన తెగ తీరుతెన్నుల్ని జక్కన్న అండ్ కో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో 200కి పైగా కీలక పాత్రలుంటాయని, వాటిలో ఒక్కోపాత్రకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని సమాచారం.
Similar News
News January 8, 2026
వామ్మో.. నాటుకోడి కేజీ రూ.2,500

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ. దీంతో కేజీ కోడి ధర రూ.2,000-2,500(గతంలో రూ.1,000-1,200) పలుకుతోంది. వైరస్‌ల కారణంగా నాటుకోళ్లను పెంచే వారి సంఖ్య తగ్గిపోవడంతో కొరత ఏర్పడింది. ఇదే అదునుగా యజమానులు రేట్లు భారీగా పెంచేశారు. అటు బ్రాయిలర్ చికెన్ రేటు కూడా రూ.300-350 పలుకుతోంది.
News January 8, 2026
చలి పంజా.. జి.మాడుగులలో 2.7 డిగ్రీలు

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. నిన్న ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 2.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. అటు TGలోని ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 7.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. ADB, నిర్మల్, ASFB, మంచిర్యాల, MDK, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
News January 8, 2026
పుష్ప స్టైల్‌లో స్మగ్లింగ్.. డీజిల్ ట్యాంక్‌లో ₹25 లక్షల డ్రగ్స్

ఇండోర్ (MP)లో Pushpa సినిమాను తలపించేలా సాగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒక ట్రక్కు కింద అచ్చం ఫ్యూయల్ ట్యాంకులా కనిపించే ఫేక్ డీజిల్ ట్యాంక్‌ను స్మగ్లర్ తయారు చేయించాడు. పోలీసులు దాన్ని ఓపెన్ చేయగా ₹25 లక్షల విలువైన 87 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. నిందితుడు బుట్టా సింగ్‌ను అరెస్ట్ చేసి ఈ ఇంటర్‌స్టేట్ డ్రగ్ నెట్‌వర్క్ వెనక ఉన్న గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.


