News May 11, 2024
మధ్యంతర బెయిల్ అంటే క్లీన్ చిట్ కాదు: షా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ క్లీన్ చిట్ కాదని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒకవేళ ఆయన అలా అనుకుంటున్నారంటే.. అది చట్టంపై కేజ్రీవాల్కు ఉన్న అవగాహనారాహిత్యమని ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల ప్రచారం కోసమే సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. జూన్ 2న మళ్లీ దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాల్సిందేనని గుర్తు చేశారు.
Similar News
News November 4, 2025
ఏపీ రౌండప్

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అధీనంలోనే ఉందన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
* ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా బొజ్జిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
* ఇవాళ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని.. కేంద్ర కార్యాలయానికి లోకేశ్
* రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో 1,49,302 హెక్టార్లలో పంట నష్టం!  
News November 4, 2025
సమానత్వం అప్పుడే ఎక్కువ

మహిళలు అనునిత్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల సమానత్వం అన్నది పుస్తకాలకే పరిమితమైంది. అయితే పురాతన కాలంలోనే ఈజిప్టు మహిళల్ని పురుషులతో సమానంగా పరిగణించేవారట. వాళ్లకంటూ సొంత ఆస్తులు, విడాకులు తీసుకునే హక్కులతోపాటు మత, రాజకీయ పదవులూ కలిగి ఉండేవారని తొలి పురావస్తు రికార్డులు చెబుతున్నాయి.
News November 4, 2025
జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

AP: సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐషర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.


