News April 6, 2024

‘హాయ్ నాన్న’కు ఇంటర్నేషనల్ అవార్డ్

image

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీకి అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు సొంతం చేసుకుంది. డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. నాజర్, జయరామ్, అంగద్ బేడీ, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలు పోషించారు.

Similar News

News February 2, 2026

పాకిస్థాన్‌కు ముందుంది ముసళ్ల పండుగ!

image

T20 WC-2026లో భారత్‌‌తో మ్యాచును బాయ్‌‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్‌కు భారీ షాకులు తప్పవని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
*టోర్నమెంట్ నుంచి పూర్తిగా బ్యాన్
*పీసీబీకి ICC వార్షిక ఆదాయ పంపిణీ నిలిపివేత
*ద్వైపాక్షిక సిరీస్‌లపై ఆంక్షలతో ఐసీసీ ర్యాంకింగ్స్, WTC పాయింట్లపై ప్రభావం పడే ఛాన్స్
*జియో- హాట్‌స్టార్ కోల్పోయిన ఆదాయాన్ని PCB చెల్లించాల్సి ఉంటుంది.

News February 2, 2026

ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.

News February 2, 2026

173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>NCERT<<>>లో 173 నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Scఅర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 27-50ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in