News October 26, 2024
ఇంటర్నేషనల్ లాగిన్.. స్విగ్గీ కొత్త ఫీచర్

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ‘ఇంటర్నేషనల్ లాగిన్’ పేరుతో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. US, కెనడా, జర్మనీ, UK, ఆస్ట్రేలియా, UAEతో సహా 27 దేశాల్లో వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. భారత్లోని తమ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ఫుడ్, నిత్యవసర వస్తువులు, గిఫ్ట్స్ ఆర్డర్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు, UPIతో చెల్లింపులు చేయొచ్చు.
Similar News
News December 1, 2025
అధ్యక్షా.. RDTని రక్షించండి!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆర్డీటీకి FCRA రెన్యువల్ విషయంపై వారు గళమెత్తాలని ప్రజలు ఆశిస్తున్నారు. రాయదుర్గం, అనంత, హిందూపురంలో రైల్వే సమస్యలు.. అరటి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర, ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు, వేగవంతంపై ఎంపీలు గొంతు విప్పాల్సిన అవసరముంది.
News December 1, 2025
‘108’ సంఖ్య విశిష్టత

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.
News December 1, 2025
SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in


