News December 24, 2024

అయోధ్యలో సిద్ధమైన అంతర్జాతీయ స్టేడియం

image

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి రానుంది. అయోధ్య – సుల్తాన్‌పూర్ రహదారిపై ఈ స్టేడియం నిర్మితమైంది. ఇది డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లో భాగమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ స్టేడియంలో 40వేల మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యూపీలో గ్రీన్‌పార్క్, లక్నోలోని ఎకానా స్టేడియం ఉన్నాయి.

Similar News

News October 16, 2025

నేడు ఈశాన్య రుతుపవనాల ఆగమనం

image

ఇవాళ దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. ఇదే రోజు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు APలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA పేర్కొంది. ఈ నెల 20కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD అంచనా వేసింది. అది వాయుగుండం లేదా తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.

News October 16, 2025

పెళ్లి కాకుండా దత్తత తీసుకోవచ్చా?

image

హిందూ దత్తత, భరణం చట్టం 1956 ప్రకారం అవివాహిత స్త్రీలు, మానసికస్థితి బావున్నవారు, మేజర్లు, పెళ్లయినా భర్త వదిలేసినవాళ్లు లేదా భర్త చనిపోయినవాళ్లు, భర్త ఏడేళ్లకు పైగా కనిపించకుండా పోయినవాళ్లు, భర్తకు మతిస్థిమితం లేదని కోర్టు ద్వారా నిరూపితమైన సందర్భాల్లో స్త్రీలు దత్తత తీసుకోవడానికి అర్హులు. సెక్షన్‌-11 ప్రకారం అబ్బాయిని దత్తత తీసుకోవాలంటే మీకు పిల్లాడికి మధ్య 21 ఏళ్లు తేడా ఉండాలి.

News October 16, 2025

ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్‌సైట్:https://www.federalbank.co.in/