News March 24, 2025
ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ వర్సిటీ.. ఒప్పందం ఖరారు

AP: విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు జార్జియా నేషనల్ వర్సిటీ ముందుకొచ్చిందన్నారు. ₹1,300Cr పెట్టుబడి పెట్టనుందని, 500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం, GNU మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
Similar News
News March 29, 2025
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు

TG: ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 36-41 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
News March 29, 2025
17 ఏళ్లుగా మహిళ కడుపులోనే కత్తెర!

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ దాదాపు 17 ఏళ్లు కడుపు నొప్పి భరించాల్సి వచ్చింది. యూపీలోని లక్నోకు చెందిన సంధ్యా పాండే అనే మహిళ పురిటి నొప్పులతో ఫిబ్రవరి 28, 2008న ‘షీ మెడికల్ కేర్’ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు సి-సెక్షన్ ఆపరేషన్ చేయగా.. ఆ సమయంలో కత్తెరను ఆమె కడుపులోనే మర్చిపోయారు. ఇన్నేళ్లుగా కడుపు నొప్పి వస్తుండటంతో KGMU ఆస్పత్రికి తీసుకెళ్లి స్కాన్ చేయించడంతో అసలు విషయం బయటపడింది.
News March 29, 2025
జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్: చంద్రబాబు

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన జెండా. తెలుగువారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా. ‘‘అన్న’’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించింది తెలుగుదేశం. ఇలాంటి చారిత్రక రోజున ప్రజాసేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్’ అని ట్వీట్ చేశారు.