News July 16, 2024
తెలంగాణ సచివాలయానికి ఇంటర్నెట్ కట్

తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. రూ.కోట్లలో పెండింగ్ బిల్లులు ఉండటంతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా బకాయిలు చెల్లించాలంటూ ‘నిపుణ’ నెట్వర్క్ విజ్ఞప్తి చేసినా చెల్లించకపోవడంతో ఇంటర్నెట్ కట్ చేసినట్లు సమాచారం. దీంతో పలు శాఖల సేవలు నిలిచిపోయాయి.
Similar News
News October 20, 2025
పౌరాణిక కథల సమాహారం ‘దీపావళి’

దీపావళి జరపడానికి 3 పౌరాణిక కథలు ఆధారం. నరక చతుర్దశి నాడే కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడిని సంహరించారు. అధర్మంపై ధర్మ విజయాన్ని స్థాపించారు. దీనికి గుర్తుగా దీపాలు వెలిగించారు. 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే. ఆనాడు అయోధ్య ప్రజలు దీపాలు పెట్టి వారికి స్వాగతం పలికారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ తిథి నాడే. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తారు.
News October 20, 2025
ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం ఉత్తర్వులు

AP: ఆర్టీసీలో నాలుగు క్యాడర్ల ఉద్యోగుల పదోన్నతులకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో చంద్రబాబు హామీ ఇవ్వగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు వంటివి ఉన్నా వాటితో సంబంధం లేకుండా ప్రమోషన్లకు అర్హులుగా పేర్కొంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టిజన్స్ క్యాడర్లోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
News October 20, 2025
అనూహ్య ఓటమి.. స్మృతి కంటతడి

WWCలో నిన్న ENGతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కంటతడి పెట్టారు. ఛేజింగ్ స్టార్టింగ్లోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ హర్మన్(70)తో కలిసి స్మృతి అద్భుత ఇన్నింగ్స్(88)తో కంఫర్టబుల్ పొజిషన్కు తీసుకెళ్లారు. అయినా ఓటమి తప్పకపోవడంతో స్మృతి ఎమోషనల్ అయ్యారు. ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్గా SMలో పోస్టులు పెడుతున్నారు.