News August 9, 2024
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ తప్పనిసరి: లోకేశ్

AP: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ప్రపంచబ్యాంకు సహకారంతో అమలవుతున్న SALT ప్రాజెక్టు తీరుపై పాఠశాల విద్య అధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో సమీక్షించారు. రాబోయే ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.
Similar News
News November 13, 2025
ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రష్మి అయ్యర్‌కు గోల్డ్ మెడల్

దక్షిణాఫ్రికాలోజరిగిన ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో నాగ్‌పూర్‌కు చెందిన రష్మీఅయ్యర్ గోల్డ్ మెడల్ గెలిచి రికార్డు సృష్టించారు. ఇందులో 22 దేశాల నుండి 390 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. గతేడాది కజకిస్తాన్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో కూడా గోల్డ్ మెడల్ సాధించిన ఆమె వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించారు. గతేడాది స్పాన్సర్లు లేకపోవడంతో ఆమె తన బంగారం అమ్మి పోటీల్లో పాల్గొన్నారు.
News November 13, 2025
నిరూపిస్తారా.. క్షమాపణ చెబుతారా: మిథున్

AP: మంగళంపేట భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ద్వేషపూరితంగా తమపై <<18274471>>ఆరోపణలు<<>> చేస్తున్నారని YCP MP మిథున్ రెడ్డి ఫైరయ్యారు. ‘ఆ భూమిని 2000లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. అప్పుడు అధికారంలో ఉంది మేం కాదు. ఆ భూమి డాక్యుమెంట్ ఆన్లైన్లో ఉంది. ఎవరైనా చూడవచ్చు. మీ ఆరోపణలను నిరూపిస్తారా లేదా క్షమాపణ చెబుతారా’ అని సవాల్ విసిరారు. గతంలో ఎర్రచందనం విషయంలో సవాల్ చేస్తే పారిపోయారని విమర్శించారు.
News November 13, 2025
నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీచేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది.


