News November 19, 2024
మణిపుర్ అంశంలో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ
మణిపుర్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. గత 18 నెలలుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో ఇప్పటికే 300 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మణిపుర్ సమస్యకు పరిష్కారం చూపాలని, ప్రజల హక్కులు, ఆస్తుల పరిరక్షణకు వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.
Similar News
News November 30, 2024
షమీకి మళ్లీ గాయం..?
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకుని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా మరోసారి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఓ మ్యాచ్‌లో బౌలింగ్ వేసే సమయంలో షమీ నడుం నొప్పితో విలవిల్లాడినట్లు సమాచారం. తమ వైద్యాధికారులు షమీకి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారని BCCI వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడటం అనుమానంగా మారింది.
News November 30, 2024
2024: ఈ ముద్దుగుమ్మలు కనిపించలే..
ఈ ఏడాది పలువురు హీరోయిన్లు టాలీవుడ్‌లో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ జాబితాలో సమంత, అనుష్క, రాశీ ఖన్నా, పూజా హెగ్డే, కీర్తి సురేశ్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. వీరిలో కొందరు ఇతర భాషా చిత్రాల్లో కనిపిస్తున్నా తెలుగులో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. కాగా అనుష్క, కీర్తి సురేశ్, రాశీ ఖన్నా నటిస్తోన్న సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. మిగిలిన భామలూ కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి.
News November 30, 2024
నవంబర్ 30: చరిత్రలో ఈ రోజు
1915: కన్యాశుల్కం నాటక కర్త గురజాడ అప్పారావు మరణం
1945: ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ జననం
1948: ప్రముఖ నటి కె.ఆర్.విజయ జననం
1990: ప్రముఖ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ జననం
1990: సినీ నటి రాశీ ఖన్నా జననం
2012: మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం
2021: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం