News October 27, 2024
INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిని కలిసిన జనక్ ప్రసాద్
INTUC జాతీయ అధ్యక్షులు డా.జి. సంజీవరెడ్డిని శనివారం తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ , యూనియన్ సెక్రటరీ జనక్ ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా సింగరేణిలో యూనియన్ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, జాతీయ, ఉమ్మడి రాష్ట్రాల INTUC వర్కింగ్ కమిటీ సమావేశం, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాల పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అంశాలపై వారు చర్చించారు.
Similar News
News November 26, 2024
నిర్మల్: మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన అదనపు కలెక్టర్
మహిళా శక్తి క్యాంటీన్లు మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. సోమవారం పట్టణంలోని వైద్య కళాశాలలో మహిళా శక్తి క్యాంటీన్‌ను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. మహిళా స్వయం సంఘాలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఆర్థికంగా బలపడడానికి తోడ్పడతాయన్నారు. ఈ మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా వైద్య విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.
News November 26, 2024
ఆసిఫాబాద్: సత్వర న్యాయం జరిగేలా చూడాలి: ఎస్పీ
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను జిల్లా SP DV.శ్రీనివాసరావు ఆదేశించారు. గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
News November 25, 2024
సిర్పూర్ (టి) : ఏఎస్ఐ ఇంట్లో దొంగతనం
సిర్పూర్ టి మండల కేంద్రానికి చెందిన కౌటాల ఏఎస్ఐ సాయిబాబా ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్లుగా ఎస్ఐ కమలాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి 2.5 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలను దొంగిలించినట్లు ఏఎస్ఐ సాయిబాబా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.