News June 29, 2024
సుబ్రహ్మణ్యం కేసు మళ్లీ విచారించండి.. ప్రభుత్వానికి ముప్పాళ్ల విజ్ఞప్తి

AP: MLC అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించాలని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హత్య జరిగినప్పుడు MLC గన్‌మెన్ ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారని, వారందరికీ శిక్ష పడాలని పేర్కొన్నారు. కాగా నిందితుడు అనంతబాబు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
Similar News
News January 30, 2026
NCERTలో 173 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<
News January 30, 2026
టమాటా రైతుల ఆవేదన.. కిలో రూపాయి కూడా లేదు!

AP: టమాటా ధరలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. 3నెలల క్రితం కిలో రూ.60 పలికిన టమాటాకి ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన నాణ్యమైన రకం ఇప్పుడు రూ.7 కూడా పడట్లేదని వాపోతున్నారు. మూడో రకమైతే రూపాయి కూడా రావట్లేదని చెబుతున్నారు. కోత కూలీ, ప్రయాణ ఖర్చులు కూడా రావట్లేదని కొందరు రైతులు పంటను వదిలేస్తున్నారు.
News January 30, 2026
కెనడా విమానాలపై ట్రంప్ టారిఫ్ బాంబ్

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త మలుపు తిరిగింది. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే విమానాలపై 50% టారిఫ్‌లు వేస్తానని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అమెరికన్ గల్ఫ్‌స్ట్రీమ్ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వకపోవడమే కారణమని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా బొంబార్డియర్ సహా కెనడియన్ విమానాల సర్టిఫికేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇటీవల <<18949938>>కెనడాపై<<>> 100% సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరించారు.


