News June 28, 2024
తిరుమలలో విజిలెన్స్ అధికారుల విచారణ

AP: తిరుమలలో YCP హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, టెండర్లు, గదుల ఆధునికీకరణ, అగర్బత్తీల తయారీ వంటి అంశాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అన్నదానం, లడ్డూ తయారీ విధానాన్నీ పరిశీలించనున్నారు.
Similar News
News December 5, 2025
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: మోదీ

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని PM మోదీ తెలిపారు. ‘శాంతియుతమైన శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను IND స్వాగతిస్తోంది. మా దేశం తటస్థంగా లేదు. ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుంది. ఉక్రెయిన్ విషయంలోనూ అదే కోరుకుంటోంది. భారత్-రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయి’ అని చెప్పారు.
News December 5, 2025
మంచి దర్శకుడు దొరికితే CBN బయోపిక్‌లో నటిస్తా: శివరాజ్‌కుమార్

AP: విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో నటించడం గర్వంగా ఉందని కన్నడ హీరో శివరాజ్ కుమార్ తెలిపారు. అలాగే మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు బయోపిక్‌లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమన్నారు. రామ్‌చరణ్ ‘పెద్ది’ మూవీలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగా తెలుగు ప్రేక్షకులూ తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు.
News December 5, 2025
టెంపుళ్ల ఆదాయంపై సుప్రీం కీలక తీర్పు

ఆలయాల ఆదాయం దేవునికి సంబంధించిందని, బ్యాంకుల మనుగడకు ఆ నిధులు వాడుకోరాదని SC స్పష్టం చేసింది. కేరళ తిరునల్వేలి ఆలయ డిపాజిట్లను 2నెలల్లో చెల్లించాలన్న HC తీర్పుపై కొన్ని సహకార బ్యాంకులు వేసిన పిటిషన్‌ను విచారించింది. వెంటనే చెల్లించాలంటే సమస్యలున్నాయని ఆ బ్యాంకులు పేర్కొనగా ‘అది మీ సమస్య’ అంటూ CJI వ్యాఖ్యానించారు. డిపాజిట్‌దారుల్లో నమ్మకం పెంచాలని, టైమ్ పొడిగింపునకు HCని ఆశ్రయించాలని సూచించారు.


