News April 12, 2024
వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ

వివేకా హత్య కేసుపై నాంపల్లి CBI కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వ్యక్తిగత హాజరుపై MP అవినాశ్, దస్తగిరి మినహాయింపు తీసుకోగా మిగతా ఐదుగురు నిందితులు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించేందుకు తమకు అభ్యంతరం లేదని CBI తెలిపింది. దీనిపై వాదనలు పూర్తి కాగా తీర్పును ఈ నెల 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Similar News
News February 2, 2026
అన్నిటికీ నేనే మాట్లాడాలా? మరి మీరెందుకు: పార్టీ నేతలపై పవన్ ఆగ్రహం

AP: పార్టీ నేతలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో YCP దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదని మండిపడ్డారు. ‘అన్నిటికీ నేనే మాట్లాడితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు? వైసీపీ దుష్ప్రచారంపై మీరు మాట్లాడాలి కదా?’ అని నిలదీశారు. మహిళల విషయంలో పార్టీనేతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
News February 2, 2026
రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం: CM రేవంత్

TG: ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ పేరిట PM మోదీ రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ‘వన్ పర్సన్.. వన్ పార్టీ’ విధానాన్ని తెచ్చేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని తొలగించేందుకే 400 సీట్లు అడిగారని అందుకే ప్రజలు వారికి సింపుల్ మెజార్టీ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఓటు హక్కును కాలరాయడానికి ‘SIR’ పేరిట ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
News February 2, 2026
టూరిస్ట్ స్పాట్‌గా డంప్‌యార్డ్.. ఎలా మారింది?

రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు SMలో సెన్సేషన్‌గా మారింది. ‘రాజస్థాన్ స్విట్జర్లాండ్’గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి మార్బుల్ వ్యర్థాల డంప్‌యార్డ్. మార్బుల్ కటింగ్ నుంచి వచ్చే తెల్లటి పౌడర్ కొండల్లా పేరుకుపోయి వర్షపు నీరు చేరడంతో అచ్చం మంచు కొండల మధ్య నీటి సరస్సులా కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఇన్‌స్టా రీల్స్, సినిమా షూటింగ్స్‌కి అడ్డాగా మారింది. ఈ డస్ట్ ఆరోగ్యానికి ప్రమాదకరం.


