News November 9, 2024
‘కల్తీ నెయ్యి’ ఆరోపణలపై విచారణ.. సిట్ అధికారులు వీరే

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల్లో నిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైంది. CBI తరఫున HYD జోన్ JD వీరేశ్ ప్రభు, విశాఖ SP మురళి రాంబా పేర్లను సంస్థ ప్రకటించింది. FSSAI నుంచి డా.సత్యేన్ కుమార్, రాష్ట్రం తరఫున గుంటూరు రేంజి IG సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి DIG గోపీనాథ్ జెట్టీలు సిట్లో ఉంటారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభమవుతుంది.
Similar News
News October 20, 2025
భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు దీపావళి వేళ భారీ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 549 పాయింట్ల లాభంతో 84,501, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,869 వద్ద స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్ కాగా ICICI బ్యాంక్, JSW స్టీల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ONGC టాప్ లూజర్స్.
News October 20, 2025
తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదు..

చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ దీపావళి పండుగను జరుపుకుంటాం. అయితే దీని వెనక మరోకోణం కూడా ఉంది. వరాహస్వామి అంశతో భూదేవి నరకుడికి జన్మనిస్తుంది. నరకుడు బాణాసురిడి స్నేహంతో రాక్షస లక్షణాలను పొంది ప్రజలను, మునులను బాధించడం మొదలుపెట్టాడు. ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించిన భూదేవి విల్లంబులు చేతబట్టి నరకాసురుడిని వధిస్తుంది. తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదని పురాణాలు చెబుతున్నాయి.
News October 20, 2025
సౌతాఫ్రికాతో టెస్టు.. రూ.60కే టికెట్

క్రికెట్ అంటే భారత్లో ఓ ఎమోషన్. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. T20ల ప్రభావమో, ఏమో టెస్టులకు ఆదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెస్టిండీస్ సిరీస్కు ప్రేక్షకుల స్పందన చూస్తే అదే అనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కోల్కతా వేదికగా (Nov 14-18) సౌతాఫ్రికాతో భారత్ తలపడే తొలి టెస్టుకు టికెట్ ప్రారంభ ధర రోజుకు రూ.60గా నిర్ణయించారు. ఇవాళ మ.12 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.