News November 16, 2024
టిడ్కో ఇళ్లలో అక్రమాలపై విచారణ: నారాయణ

AP: గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లలో జరిగిన అక్రమాలపై మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. లబ్ధిదారుల కేటాయింపు, డీడీల చెల్లింపుల్లో అవకతవకలపై MLAల ఫిర్యాదులతో విచారణ చేస్తున్నామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అటు 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చామని, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు నిర్మిస్తామన్నారు. ముందుగా 4.54 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు.
Similar News
News December 28, 2025
ముర్ము చరిత్ర: సాగరగర్భంలో రాష్ట్రపతి ప్రయాణం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా నిలిచే స్వదేశీ సబ్‌మెరైన్ INS వాఘ్‌షీర్‌లో ఆమె ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నావికా కేంద్రం నుంచి సముద్ర గర్భంలో సాగిన ఈ యాత్రలో సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా ఆమె పాల్గొన్నారు. అబ్దుల్ కలాం తర్వాత ఈ ఘనత సాధించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు.
News December 28, 2025
APPLY NOW: ICGEBలో ఉద్యోగాలు

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనిటిక్ ఇంజినీరింగ్& బయో టెక్నాలజీ(<
News December 28, 2025
మిరపలో ఆకు ముడత తెగులు – యాజమాన్యం

పొలానికి ఆఖరి దుక్కిలో ఎకరాకు 200కిలోల వేప పిండి, తిరిగి బోదెలు ఎగవేయునపుడు 100 కిలోల వేప పిండి వేసుకోవాలి. నారు మొక్కలు నాటే 15 రోజుల ముందు పొలం చుట్టూ 2-3 వరుసల మొక్కజొన్న లేదా సజ్జ మొక్కలను పెంచాలి. నాటిన తర్వాత ఎకరాకు 10 పసుపు, 10 నీలం రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటు చేయాలి. నారు మొక్కలను నాటే ముందు ఇమిడాక్లోప్రిడ్ (లీటరు నీటికి 0.5 మి.లీ) మందు ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవాలి.


