News February 2, 2025
కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణంపై దర్యాప్తు

గత నెల 29న మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30మంది మృతిచెందగా 60మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్రకోణం దిశలో యూపీ సర్కారు దర్యాప్తు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 16వేలకు పైగా ఫోన్ నంబర్ల డేటాను అధికారులు విశ్లేషించారని, సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఘటనపై దర్యాప్తుకోసం సర్కారు ఇప్పటికే త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
Similar News
News March 11, 2025
WPL: గెలిస్తే నేరుగా ఫైనల్‌కు

WPL 2025లో ముంబై ఇండియన్స్ మరోసారి ఫైనల్‌కి చేరువైంది. ఇవాళ బెంగళూరుతో జరిగే మ్యాచులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరనుంది. నిన్నటి మ్యాచులో గుజరాత్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో MI(10P) రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఢిల్లీకీ 10 పాయింట్లే ఉన్నా NRR ఎక్కువ ఉండటంతో తొలి స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో MI ఓడితే ఎలిమినేటర్‌లో గుజరాత్‌తో తలపడనుంది.
News March 11, 2025
ఆర్థికమాంద్యం ముప్పులో అమెరికా!

అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిబంధనలతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఇన్వెస్టర్లు భావించడంతో నాస్డాక్ 4 శాతం క్షీణించింది. 2022 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద నష్టం ఇదే. టెస్లా, Nvidia, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ షేర్లు భారీగా నష్టపోయాయి. 1.9 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఈ ఏడాది అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు 40%కి పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
News March 11, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఓ వైపు రాష్ట్రంలో ఎండలు దంచికొడుతుంటే చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో ఇవాళ, రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తూర్పు గాలుల ప్రభావం ఉందని పేర్కొంది. మరోవైపు నిన్న నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 38.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, ఏలూరు జిల్లాలోని పలు చోట్ల వడగాలులు వీస్తాయని APSDMA వెల్లడించింది.