News September 1, 2024
కాళేశ్వరంపై విచారణ.. కమిషన్ గడువు పెంపు

TG: కాళేశ్వరం అక్రమాలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ గడువును ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు పొడిగించింది. నిన్నటితో గడువు ముగియగా, మరో 2 నెలలు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు ఇంజినీర్లు, మాజీ సెక్రటరీల నుంచి ఘోష్ అఫిడవిట్లను స్వీకరించారు. అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈనెల 10 నుంచి రెండో రౌండ్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించనున్నారు.
Similar News
News March 14, 2025
ఇన్సూరెన్స్ కంపెనీ కొంటున్న బాబా రాందేవ్

FMCG మేజర్, బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. మాగ్మా ఇన్సూరెన్స్లో తన 90% వాటాను పతంజలి, DS గ్రూప్నకు విక్రయిస్తున్నట్టు అదార్ పూనావాలా ప్రకటించారు. ఈ డీల్ విలువ రూ.4500 కోట్లని తెలుస్తోంది. ప్రస్తుతం వెహికల్, హెల్త్, పర్సనల్ యాక్సిడెంట్, హోమ్, కమర్షియల్ ఇన్సూరెన్స్ సేవలను మాగ్మా అందిస్తోంది. FY24లో కంపెనీ GWP రూ.3,295 కోట్లుగా ఉంది.
News March 14, 2025
గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.
News March 14, 2025
NEPని ఒప్పుకోనందుకు రూ.2,152 కోట్లు ఇవ్వలేదు: తమిళనాడు మంత్రి

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అంగీకరించనందుకు కేంద్రం తమిళనాడుకు రూ.2,152 కోట్లు విడుదల చేయలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ‘మా రాష్ట్రంలో మూడు భాషల విధానాన్ని అంగీకరించనందుకు కేంద్రం ఆ నిధులను ఆపింది. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమం, టీచర్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం’ అని బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు.