News April 4, 2025
కేరళ CM కూతురిపై విచారణకు ఆదేశం

అక్రమ చెల్లింపుల కేసులో కేరళ CM పినరయి విజయన్ కూతురు వీణను విచారించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎటువంటి సేవలు అందించకపోయినా ఆమెకు చెందిన ఎక్సలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు కొచ్చిన్ మినరల్స్&రూటైల్ లిమిటెడ్ నుంచి రూ.2.73కోట్ల చెల్లింపులు జరిగినట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(SFIO) కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించింది. దీని ఆధారంగా వీణతో పాటు ఇతర నిందితులపై విచారణకు కేంద్రం ఆదేశించింది.
Similar News
News April 10, 2025
స్టైల్‌తో కాదు.. ‘రఫ్’లుక్‌తో ఇరగదీస్తున్నారు!

హీరో అంటే అందంగా, చొక్కా నలగకుండా స్టైల్‌గా కనిపించాలనే ధోరణి నుంచి మన హీరోలు బయటికొచ్చేశారు. రఫ్, రగ్గ్డ్ లుక్‌తో దుమ్మురేపుతున్నారు. పుష్పలో అల్లు అర్జున్, దేవరలో NTR, తండేల్‌లో నాగచైతన్య, దసరాలో నాని ఇదే తరహాలో కనిపించారు. లేటెస్ట్ మూవీస్ చూస్తే ‘పెద్ది’లో రామ్ చరణ్, ‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండ, ‘ప్యారడైజ్’లో నాని, ‘లెనిన్’లో అఖిల్ గుబురు గడ్డం, దుమ్ముకొట్టుకుపోయిన శరీరాలతో కనిపిస్తున్నారు.
News April 10, 2025
GOOD NEWS.. త్వరలో అకౌంట్లోకి డబ్బులు

TG: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు బోనస్ చెల్లించడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తుండగా, రూ.1500 కోట్లు అవసరం కానున్నాయి. కాగా NZB, కామారెడ్డి, NLG, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి.
News April 10, 2025
నేటి నుంచి బీజేపీ ‘గావ్ చలో.. బస్తీ చలో’

TG: ప్రజల్లో వక్ఫ్ సవరణలపై అవగాహన కల్పించేందుకు గాను బీజేపీ నేటి నుంచి 12వ తేదీ వరకు ‘గావ్ చలో.. బస్తీ చలో’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తాము చేసిన సవరణల వల్ల పేద ముస్లింలకు కలిగే ప్రయోజనాల్ని నేతలు ప్రజల్లో తిరిగి వివరించనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కే. లక్ష్మణ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఇందులో భాగస్వాములు కానున్నారు.