News October 13, 2025

వెండిపై పెట్టుబడి: ట్రేడర్‌కు రూ.600 కోట్ల నష్టం!

image

కమోడిటీ ట్రేడింగులో అనుభవలేమి నిలువునా ముంచుతుందనేందుకు మరో ఉదాహరణ. కొండెక్కిన వెండిని ఒకరు భారీగా షార్ట్ చేశారని స్టాక్ మార్కెట్ కోచ్ ఏకే మాన్‌ధన్ ట్వీట్ చేశారు. అయితే రేటు ఇంకా ఎగిసి ATHకు చేరడంతో బ్రోకర్ ఆ పొజిషన్లను క్లోజ్ చేశారన్నారు. దాంతో ఆ ట్రేడర్ ఏకంగా రూ.600Cr నష్టపోయాడని తెలిపారు. అతడెవరో ఆయన వెల్లడించలేదు. మొదట ఎక్కువ ధరకు అమ్మి తర్వాత తక్కువ ధరకు కొని లాభపడటాన్ని షార్టింగ్ అంటారు.

Similar News

News October 13, 2025

పాక్‌లో ఆగని అల్లర్లు

image

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా TLP చేపట్టిన ఆందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతూనే ఉంది. లాహోర్‌లో పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో మరణించగా నేడు కూడా ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపు వెళ్లేందుకు రోడ్లపై అడ్డంగా పెట్టిన షిప్పింగ్ కంటైనర్లను తొలగించబోయారు. దీన్ని అడ్డుకున్న పోలీసులపై వారు కాల్పులు జరిపినట్లు పంజాబ్ పోలీస్ చీఫ్ పేర్కొన్నారు. తాజా ఘర్షణల్లో పోలీసు అధికారితో సహ ఐదుగురు మరణించారు.

News October 13, 2025

సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు 10 మంది మినిస్టర్లతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, DSBV స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, గొట్టిపాటి రవి కుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.

News October 13, 2025

టాటా మెమోరియల్ సెంటర్‌లో 78 ఉద్యోగాలు

image

టాటా మెమోరియల్ సెంటర్‌ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (పంజాబ్)‌లో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ, అంకాలజీ నర్సింగ్ డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. https://tmc.gov.in/