News September 23, 2025
₹3,745 కోట్ల పెట్టుబడులు.. 1,518 ఉద్యోగాలు

TG: రాష్ట్రంలో కోకా కోలా, JSW, తోషిబా కంపెనీల ₹3,745 కోట్ల విలువైన పెట్టుబడులకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 1,518 ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. కోకా కోలా ₹2,398Cr (600 ఉద్యోగాలు), JSW UAV కొత్త యూనిట్ ₹785Cr (364 జాబ్స్), తోషిబా ₹562Cr (554 జాబ్స్) పెట్టుబడులు పెట్టనున్నాయి. కోకా కోలా వంటి కంపెనీల ఏర్పాటుతో మామిడి, నారింజ రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని Dy.CM భట్టి అన్నారు.
Similar News
News September 24, 2025
క్రికెట్ నుంచి బ్రేక్.. శ్రేయస్ నిర్ణయం?

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని డిసైడైనట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంతో తాను లాంగెస్ట్ ఫార్మాట్‌కు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఆయన బీసీసీఐకి లేఖ రాసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అయ్యర్ లేదా బీసీసీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా-Aతో ఈరోజు ప్రారంభమైన రెండో అన్‌అఫీషియల్ టెస్టుకూ శ్రేయస్ దూరమయ్యారు.
News September 23, 2025
GREAT: 3 సార్లు H1B రాకపోయినా..

బెంగళూరుకు చెందిన తనూశ్ శరణార్థి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మూడుసార్లు H1B వీసా కోల్పోయినా వెనుకడుగు వేయకుండా ప్రతిష్ఠాత్మక వీసా సాధించారు. ‘నేను వరుసగా 3 సార్లు లాటరీల్లో H1B సాధించలేకపోయాను. దీంతో రాత్రింబవళ్లు కష్టపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించా. ఈ వారం 0-1 వీసా అప్రూవ్ అయింది’ అని పేర్కొన్నారు. 0-1 వీసాను Einstein visa అంటారు. ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్ ఉన్నవారికే ఇది వస్తుంది.
News September 23, 2025
బికినీలో సాయిపల్లవి అని ప్రచారం.. నిజమేనా?

సాయి పల్లవి బికినీ ధరించారంటూ కొన్ని ఫొటోలు SMలో వైరలయ్యాయి. ఇవి నిజమని నమ్మిన కొందరు మూవీ ఛాన్సుల కోసం ఆమె మారిపోయారంటూ విమర్శిస్తున్నారు. అయితే అవి నిజమైన ఫొటోలు కాదని తేలింది. ఆమె సోదరి పూజ ఇటీవల స్విమ్ సూట్ ధరించిన ఫొటోలను instaలో పోస్ట్ చేయగా, వాటిని కొందరు బికినీ ధరించినట్లుగా AI సాయంతో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలుస్తున్నారు.