News January 28, 2025
పక్కా ప్రణాళికతో దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్

TG: తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారని CM రేవంత్ అన్నారు. కొందరు HYDకు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. అయితే ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారని తెలిపారు. పక్కా ప్రణాళికతో వెళ్లడంతో దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఇదో అద్భుత పరిణామమని పేర్కొన్నారు.
Similar News
News March 14, 2025
ఇన్సూరెన్స్ కంపెనీ కొంటున్న బాబా రాందేవ్

FMCG మేజర్, బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. మాగ్మా ఇన్సూరెన్స్‌లో తన 90% వాటాను పతంజలి, DS గ్రూప్‌నకు విక్రయిస్తున్నట్టు అదార్ పూనావాలా ప్రకటించారు. ఈ డీల్ విలువ రూ.4500 కోట్లని తెలుస్తోంది. ప్రస్తుతం వెహికల్, హెల్త్, పర్సనల్ యాక్సిడెంట్, హోమ్, కమర్షియల్ ఇన్సూరెన్స్ సేవలను మాగ్మా అందిస్తోంది. FY24లో కంపెనీ GWP రూ.3,295 కోట్లుగా ఉంది.
News March 14, 2025
గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.
News March 14, 2025
NEPని ఒప్పుకోనందుకు రూ.2,152 కోట్లు ఇవ్వలేదు: తమిళనాడు మంత్రి

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అంగీకరించనందుకు కేంద్రం తమిళనాడుకు రూ.2,152 కోట్లు విడుదల చేయలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ‘మా రాష్ట్రంలో మూడు భాషల విధానాన్ని అంగీకరించనందుకు కేంద్రం ఆ నిధులను ఆపింది. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమం, టీచర్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం’ అని బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు.