News October 19, 2025
16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

గత 16 నెలల్లో ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క APలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది’ అని AUSలో తెలుగు డయాస్పోరా సమావేశంలో తెలిపారు.
Similar News
News October 19, 2025
రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలి: సీఎం చంద్రబాబు

AP: చీకట్లను పారద్రోలి వెలుగుల్ని తీసుకువచ్చే పండుగ దీపావళి అని CM CBN అన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీ కృష్ణ, సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలి. రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలి’ అని ట్వీట్ చేశారు. అటు దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని YS జగన్ ఆకాంక్షించారు.
News October 19, 2025
ఓటమిపై కెప్టెన్ గిల్ ఏమన్నారంటే?

పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోవడం తమను దెబ్బతీసిందని టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అన్నారు. ఆస్ట్రేలియాతో ఓటమి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఓటమితో చాలా పాఠాలు నేర్చుకున్నామని, ఇదో పాజిటివ్ విషయమని చెప్పారు. 131 పరుగుల లక్ష్యఛేదనను చాలా డీప్‌గా తీసుకెళ్లామని, తమకు సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. ఈ మ్యాచులో రోహిత్ (8), కోహ్లీ (0), గిల్ (10) పవర్ ప్లేలోనే వెనుదిరిగారు.
News October 19, 2025
HCUలో 52 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) 52 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 24 అప్లైకి చివరితేదీ కాగా.. NOV 8 వరకు పొడిగించింది. మొత్తం పోస్టుల్లో Asst లైబ్రేరియన్, Asst రిజిస్ట్రార్, Sr అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, Jr ఆఫీస్ అసిస్టెంట్, Lab అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, PG, బీటెక్, ఎంటెక్‌తో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://uohyd.ac.in/