News October 23, 2024

రూ.1,000 కోట్ల పెట్టుబడులు.. 12,500 మందికి ఉపాధి: ప్రభుత్వం

image

AP: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ డ్రోన్ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు, 12,500 మందికి ఉపాధి కల్పించేలా ముసాయిదా డ్రోన్ పాలసీని ప్రకటించింది. దీనిపై కూటమి పార్టీలు, నిపుణుల సూచనలు తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామంది. నవంబర్ వరకు ఫైనల్ పాలసీని తీసుకొస్తామని చెప్పింది.

Similar News

News October 23, 2024

STOCK MARKETS: ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా!

image

బెంచ్‌మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న బలమైన షేర్లను ఇన్వెస్టర్లు కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 80,381 (+158), నిఫ్టీ 24,521 (+49) వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా లేదా చూడాల్సి ఉంది. రియాల్టి, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఐటీ, ఫైనాన్స్, మెటల్ షేర్లు పుంజుకున్నాయి.

News October 23, 2024

సిద్ధిఖీ హత్య.. నిందితుడికి టెన్త్‌లో 78% మార్కులు!

image

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన షూటర్స్‌లో ఒకడైన UPకి చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. అతను టెన్త్ క్లాస్‌లో 78శాతం మార్కులు సాధించినట్లు ధర్మరాజ్ సోదరుడు తెలిపారు. నాడు ధర్మరాజ్‌ను మెడిసిన్ చదివించాలని తల్లిదండ్రులు భావించినట్లు చెప్పాడు. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను చూసి ఆకర్షితుడయ్యాడని, డబ్బు కోసం తప్పుదారి పట్టాడని పేర్కొన్నారు.

News October 23, 2024

వ్యక్తిని దారుణంగా చంపి.. PSలో రీల్స్!

image

TG: కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని <<14421491>>హత్య<<>> చేసిన నిందితుడు సంతోష్ జగిత్యాల గ్రామీణ PSలో చేసిన రీల్ వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అయితే ఆ వీడియో గతంలోనిదని పోలీసులు వివరణ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి ఫిర్యాదు చేసినా సంతోష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో పోలీసులు పట్టించుకోలేదని INC నేతలు ఆరోపించారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యమని మండిపడ్డారు.