News September 28, 2025

రాష్ట్రానికి రూ.15,279 కోట్ల పెట్టుబడులు: CMO

image

TG: టూరిజం కాంక్లేవ్‌లో రాష్ట్రానికి ₹15,279 కోట్ల పెట్టుబడులు, 50 వేల మందికి ఉపాధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయని CMO తెలిపింది. 30 ప్రాజెక్టులతో 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, మొత్తం 50,000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు పేర్కొంది. వీటిల్లో 14 పీపీపీ ప్రాజెక్టులు, 16 ప్రైవేట్ రంగ ప్రాజెక్టులు ఉన్నాయంది. TGని గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించింది.

Similar News

News February 8, 2026

క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ?

image

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీకి నిన్న <<19077394>>శంకుస్థాపన<<>> పడిన వేళ క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటి అనే చర్చ మొదలయింది. ఇది సంప్రదాయ కంప్యూటర్లకు మించిన శక్తిమంతమైనవి. ఇప్పటి కంప్యూటర్లు 0, 1 బిట్లపై పనిచేస్తే, క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్‌పై ఆధారపడతాయి. క్యూబిట్ ఒకేసారి 0, 1గా ఉండగలగడం వల్ల అత్యంత వేగంగా పనిచేస్తాయి. మామూలు కంప్యూటర్లు కొన్ని ఏళ్లు చేసే పనిని ఇవి సెకన్లలోనే చేస్తాయి.

News February 8, 2026

క్వాంటం వ్యాలీతో నిరుద్యోగులకు లాభం ఏంటి?

image

AP: క్వాంటం వ్యాలీ ద్వారా నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుతో దాదాపు లక్ష ఉద్యోగాలు వస్తాయని భావిస్తోంది. యువతకు క్వాంటం టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తామని చెప్తోంది. IITలు, గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ సాగనుందని, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతే టెక్ కెరీర్ కేంద్రంగా మారనుందని తెలిపింది.

News February 8, 2026

అసలైన ‘ధురంధరుడు’.. దేశం కోసం సర్వం త్యాగం చేసినా..

image

‘ధురంధర్’ మూవీ ట్రెండింగ్‌లో ఉండగా కశ్మీర్‌కు చెందిన భారత గూఢచారి రోషన్ లాల్ జల్లా స్టోరీ వైరల్ అవుతోంది. 1969, 1970, 1971లో పాకిస్థాన్ వెళ్లి విలువైన సమాచారాన్ని మన దేశానికి చేరవేశారు. ఇండియాకు తిరిగొస్తూ 1972లో పట్టుబడ్డారు. ఆయనను జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. 1987లో జైలు నుంచి రిలీజై ఇండియాకు రాగా ప్రభుత్వం చికిత్సకు డబ్బులివ్వలేదు. కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేదు. 2021లో అనామకుడిగా మరణించారు.