News February 7, 2025

8 నెలల్లో రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు: TDP

image

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రంలో చాలా కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చినట్లు టీడీపీ ట్వీట్ చేసింది. 34 ప్రాజెక్టుల ద్వారా రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేసింది. త్వరలో ఏర్పాటు కానున్న కంపెనీల్లో 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పూర్తి వివరాలను వెల్లడించింది.

Similar News

News March 29, 2026

వేసవిలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే

image

అధిక వేడి, డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘శరీరంలో నీటి శాతం తగ్గితే కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గి సరిగా పనిచేయవు. హైడ్రేషన్ కోసం మజ్జిగ, నిమ్మరసం, పుచ్చకాయ, ద్రాక్ష, దోస, సొరకాయ వంటివి తీసుకోవాలి. 12pm-3pm మధ్య బయట తిరగొద్దు. బయట పనిచేసేవారు 20minకోసారి గ్లాస్ వాటర్ తాగాలి. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే అది డీహైడ్రేషన్‌కు సంకేతం’ అని చెబుతున్నారు.

News March 29, 2026

తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతం కట్.. బిల్లు పూర్తి వివరాలివే

image

TG: ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు, 2026’ను ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. జీతం నుంచి 15% లేదా రూ.10,000.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు చెల్లిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, MLAలు, MLCలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచుకూ ఇది వర్తిస్తుంది. తల్లిదండ్రులు కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాక 60 రోజుల్లోపు పరిష్కరించాలి.

News March 29, 2026

ఇండియాలో పాపులర్ బ్రాండ్లు.. ఫుల్ నేమ్స్

image

*PVR- ప్రియా విలేజ్ రోడ్‌షో
*MRF- మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ
*ITC- ఇండియన్ టొబాకో కంపెనీ
*DLF- ఢిల్లీ ల్యాండ్ & ఫైనాన్స్
*HCL- హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్
*AMUL- ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్
*OYO- ఆన్ యువర్ ఓన్
*TVS: Thirukkurungudi Vengaram Sundram