News January 10, 2025
మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
AP: 1995లో ఏమీలేని స్థితి నుంచి HYDను అభివృద్ధి చేశామని CM చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఏపీ నిర్మాణ రంగ అభివృద్ధిపై దృష్టిసారించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ₹4L Cr పెట్టుబడులకు సంతకాలు పూర్తయ్యాయని వెల్లడించారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ ‘YCP ప్రభుత్వం చేసిన అక్రమాలతో భూసమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 10, 2025
BREAKING: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం
TG: ఆదివాసీలపై CM రేవంత్ వరాల జల్లు కురిపించారు. ఆదివాసీ యోధుడు కొమురం భీం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని వారితో భేటీలో తెలిపారు. ఆదివాసీ విద్యార్థులకు 100% ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందిస్తామన్నారు. గిరిజన రైతులకు ఉచితంగా సోలార్ మోటర్లు అందిస్తామని, ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గోండు భాషలో బోధనపై నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
News January 10, 2025
రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
ఐర్లాండ్ మహిళా టీమ్‌తో జరిగిన <<15119434>>తొలి వన్డేలో<<>> 29 బంతుల్లో 41 రన్స్ చేసిన స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. అత్యంత వేగంగా(95 మ్యాచ్‌లు) 4,000 ODI పరుగులు పూర్తిచేసుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా మూడో క్రీడాకారిణిగా ఘనత సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన బిలిందా క్లార్క్(86), మిగ్ లానింగ్(87) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గతంలో మిథాలీరాజ్ 112 వన్డేల్లో ఈ ఫీట్ నమోదుచేశారు.
News January 10, 2025
సావర్కర్‌పై కామెంట్స్.. రాహుల్ గాంధీకి బెయిల్
పరువు నష్టం కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. 2023 మార్చిలో లండన్ వేదికగా VD సావర్కర్‌పై రాహుల్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మనవడు సత్యకి సావర్కర్ పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.