News December 20, 2024

ఇన్వెస్టర్లు లబోదిబో.. నిఫ్టీ 250Pts డౌన్

image

స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు అల్లాడుతున్నారు. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన నిఫ్టీ 100 Pts ఎగిసి 24065 వద్ద గరిష్ఠాన్ని తాకింది. వెంటనే 60 Pts మేర నష్టాల్లోకి జారుకుంది. ఆపై పుంజుకొని రేంజుబౌండ్లో కొనసాగింది. మళ్లీ నేలవైపు పరుగులుపెట్టింది. ప్రస్తుతం 250 Pts నష్టంతో 23710 వద్ద ట్రేడవుతోంది. 1000 Pts మేర పడ్డ సెన్సెక్స్ 850 Pts నష్టంతో 78,367 వద్ద కొనసాగుతోంది.

Similar News

News December 7, 2025

CSIR-CCMBలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ &మాలిక్యులర్ బయాలజీలో 13 సైంటిస్టు పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని జనవరి 6వరకు పోస్ట్ చేయాలి. నెలకు జీతం రూ.1,38,652 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో విద్యార్హత, వయసు, పరీక్ష విధానం వెల్లడించనున్నారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in/

News December 7, 2025

టెన్త్ విద్యార్థులకు శుభవార్త

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మార్చి వరకు సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే వారికి రెండో శని, ఆదివారాల్లో మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులను ఆదేశించింది.

News December 7, 2025

డ్రగ్స్‌తో పట్టుబడితే 20 ఏళ్ల జైలు: రవికృష్ణ

image

AP: సరదాల కోసం డ్రగ్స్‌కు అలవాటుపడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఈగల్ IG రవికృష్ణ సూచించారు. ‘డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఉద్యోగ అవకాశం కోల్పోతారు. జీవితాంతం దేశంలో ఎక్కడ ఉన్నా పోలీసు నిఘా ఉంటుంది. అనుమానం వస్తే తిరిగి జైలు తప్పదు’ అని హెచ్చరించారు. పిల్లలు డ్రగ్స్‌కు అలవాటుపడకుండా పేరెంట్స్ చూడాలన్నారు. డౌట్ వస్తే ‘1972’ నంబర్‌కి చెబితే రక్షించుకోవచ్చని తెలిపారు.