News September 17, 2024
ఇన్వెస్టర్ల అప్రమత్తత.. రేంజుబౌండ్లో సూచీలు

బెంచ్మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. US ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. కొనుగోళ్లలో దూకుడు ప్రదర్శించడం లేదు. సెన్సెక్స్ 82,915 (-78), నిఫ్టీ 25,366 (-16) వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 25:25గా ఉంది. HDFC బ్యాంకు, ఎయిర్టెల్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. బ్రిటానియా, దివిస్ ల్యాబ్, LTIM, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్.
Similar News
News September 16, 2025
నో మేకప్.. మేకప్ లుక్ కావాలా?

ప్రస్తుతకాలంలో ‘నో మేకప్- మేకప్ లుక్’ ట్రెండ్ అవుతోంది. దీనికోసం తేలిగ్గా ఉండే మాయిశ్చరైజర్, రేడియన్స్ ప్రైమర్, ల్యుమినైజింగ్ ఫౌండేషన్ వాడాలి. డార్క్ సర్కిల్స్ కనిపించకుండా లైట్గా కన్సీలర్ రాయాలి. ఐ ల్యాష్ కర్లర్, మస్కారా, ఐ లైనర్ అప్లై చెయ్యాలి. చీక్ బోన్స్పై బ్రాంజర్, బ్లషర్ రాయాలి. మ్యూటెడ్ లిప్ కలర్, టింటెడ్ లిప్ బామ్ పెదవులకు అద్దాలి. అంతే మీ నో మేకప్ లుక్ రెడీ.
News September 16, 2025
పాడి పశువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.
News September 16, 2025
విద్యార్థి తలపై కొట్టిన టీచర్.. విరిగిన పుర్రె ఎముక

AP: అల్లరి చేస్తోందని విద్యార్థినిని కొట్టడంతో తలకు తీవ్రగాయమైన ఘటన చిత్తూరు(D) పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది. ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ(11)ని ఈ నెల 10న ఓ టీచర్ స్కూల్ బ్యాగ్తో కొట్టాడు. తలనొప్పిగా ఉండటంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముక చిట్లినట్లుగా పరీక్షల్లో తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.