News June 7, 2024
RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్!

ఎన్నికల ఫలితాలతో ఒడుదొడుకులకు గురై మళ్లీ మార్కెట్లు కోలుకుంటున్న వేళ ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు RBI మీద పడింది. మానిటరీ పాలసీ నిర్ణయాలను ఈరోజు RBI వెల్లడించనుండటమే ఇందుకు కారణం. ద్రవ్యోల్బణం తగ్గి, GDP వృద్ధిపై RBI అంచనా పెంచితే అది తమకు సానుకూలంగా మారొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఇక వడ్డీ రేట్లను మరోసారి RBI 6.5శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


