News September 25, 2024
ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

TG: HYD హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్షిప్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు <
Similar News
News December 14, 2025
TG రెండో దశ సర్పంచ్ ఎన్నికల అప్డేట్స్

* ఖమ్మం(D) అనాసాగరంలో సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు(40) కన్నుమూశారు. నామినేషన్ రోజే అనారోగ్యంతో ఆస్పత్రి పాలవగా ఇవాళ పోలింగ్ రోజు చనిపోయారు.(ఫొటోలోని వ్యక్తి)
* నారాయణపేట(D) మరికల్‌కు చెందిన భాస్కర్ దుబాయ్ నుంచి వచ్చి ఓటు వేశారు.
* ఖమ్మం(D) గోళ్లపాడులో ఓ అభ్యర్థి స్లిప్‌తో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఆకులోని అన్నం, బొగ్గులు, మాంసం, ఎండుమిర్చి, అభ్యర్థి స్లిప్ పెట్టారు.
News December 14, 2025
40 రోజుల్లో 150కి పైగా పెళ్లిళ్లు రద్దు.. కారణమిదే?

MPలోని ఇండోర్‌లో 40 రోజుల వ్యవధిలో 150కి పైగా జంటలు తమ పెళ్లిని రద్దు చేసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం(62%) సోషల్ మీడియానే అని ఓ నివేదిక తెలిపింది. పాత రిలేషన్లకు సంబంధించిన SM పోస్టులు గొడవకు దారి తీస్తున్నాయని వెల్లడించింది. మరికొన్ని ఘటనల్లో కుటుంబంలో మరణాలు, ఇతర కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇలా ఆకస్మిక రద్దు నిర్ణయాలతో వెడ్డింగ్ ప్లానర్స్, హోటల్ నిర్వాహకులు నష్టపోతున్నారని తెలిపింది.
News December 14, 2025
టమాటాలో కాయ పగుళ్లకు కారణం – నివారణ

టమాటా కాయ అభివృద్ధి చెందే దశలో కాయ తొడిమ వైపు, పూత చివరి వైపునకు నిలువు పగుళ్లు కనిపిస్తాయి. నీటి లభ్యతలో తేడాలు, అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం తర్వాత వానలు, బోరాన్ లోపం వల్ల ఈ పగుళ్లు కనిపిస్తాయి. దీని నివారణకు నేలలో తేమ సంరక్షణకు మల్చింగ్ చేపట్టాలి. నత్రజని ఎరువులను సిఫారసు మేరకే వాడాలి. పూత, పిందె దశల్లో లీటరు నీటికి డైసోడియం ఆక్టాబోరెట్ 1.25-1.5గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


