News August 28, 2024
మాస్కో నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రష్యాలోని మాస్కోలో ‘ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ పోర్టల్’లో ప్రసంగించేందుకు ఆహ్వానం వచ్చిందని KTR న్యూస్ ట్విటర్ హ్యాండిల్ తెలిపింది. అక్కడ నిర్వహించే స్కోల్కోవో స్టార్టప్ ఈవెంట్‌లో కేటీఆర్ 30నిమిషాల పాటు ప్రసంగిస్తారని వెల్లడించింది. మాస్కో ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ పోర్టల్ 2030-2050 ఫెస్టివల్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు నిర్వహించనుంది.
Similar News
News March 13, 2026
15ఏళ్లలో లేనంతగా క్రాష్.. $533 బిలియన్ల నష్టం!

సెన్సెక్స్ ఈరోజు 878 పాయింట్ల నష్టంతో 75,174.. నిఫ్టీ 299 Pts నష్టంతో 23,339 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో ₹489L Crగా ఉన్న భారత మార్కెట్ క్యాప్ ₹440L Crకు తగ్గింది. 2011లో $625B కోల్పోగా ఈ ఏడాది మూడు నెలల్లోనే ఆ స్థాయి పతనం నమోదైంది. ఈ నష్టం మెక్సికో, మలేషియా, నార్వే, ఖతర్, వియత్నాం వంటి దేశాల Mcap కంటే ఎక్కువ. FII సెల్లింగ్, ట్రేడ్ టెన్షన్స్, యుద్ధాలు ఇందుకు కారణం.
News March 13, 2026
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం

AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చండీగఢ్‌కు చెందిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి హాలులో ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 24న CJ పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా చరిత్రకెక్కనున్నారు.
News March 13, 2026
42 ఏళ్లు కోమాలో ఉన్న అరుణ గురించి తెలుసా?

12 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఇటీవల <<19352489>>అనుమతిచ్చింది.<<>> ఈ తీర్పునకు ముంబైకి చెందిన నర్సు అరుణా షాన్‌బాగ్ కేసు స్ఫూర్తి. 1973లో ఆమెను రేప్ చేసి దాడి చేయడంతో 42 ఏళ్లపాటు కోమాలో ఉండి 2015లో చనిపోయారు. 2009లో ఆమె కారుణ్య మరణం కోసం ఓ జర్నలిస్టు పిల్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 2011, 2018, 2023లో వెలువడిన తీర్పులు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశాయి.


