News March 2, 2025
IPLను బాయ్‌కాట్ చేయాలని ఇంజమామ్ పిలుపు

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ IPLపై విషం కక్కారు. IPLను బాయ్‌కాట్ చేయాలని ఇతర దేశాల క్రికెట్ బోర్డులకు పిలుపునిచ్చారు. ‘భారత క్రికెటర్లు ఏ ఇంటర్నేషనల్ లీగ్‌లలో పాల్గొనరు. కానీ ప్రపంచంలోని టాప్ ప్లేయర్లందరూ IPL ఆడతారు. భారత ప్లేయర్లు ఫారిన్ లీగ్స్ ఆడే వరకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లను ఐపీఎల్ ఆడేందుకు ఇండియాకు పంపొద్దు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 3, 2025
దేవర-2లో రణ్‌వీర్ సింగ్?

జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సూపర్ హిట్ కావడంతో పార్ట్-2పై డైరెక్టర్ కొరటాల శివ కసరత్తు చేస్తున్నారు. ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేసి కొత్త స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేపై ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. త్వరలోనే ఆయనకు కథను వినిపిస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2026 జనవరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News March 3, 2025
6 MLC స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉ.గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ, TGలో MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి పోలింగ్ జరిగింది. కాగా టీచర్ స్థానాలకు ఇవాళ సాయంత్రం. పట్టభద్రుల MLCలకు రెండు రోజుల వరకు కౌంటింగ్ కొనసాగనుంది.
News March 3, 2025
కొత్త రేషన్ కార్డులు.. ఇంకెంత దూరం?

TG: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగదీతపై దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఈ నెల 1న లక్ష కార్డులు <<15572734>>ఇస్తామని చెప్పగా<<>> అమల్లోకి రాలేదు. పరిశీలన ప్రక్రియ పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ విద్యుత్, ₹500కే సిలిండర్ లాంటి పథకాలకు రేషన్ కార్డే కీలకం. దీంతో కొత్త కార్డులు, పాత కార్డుల్లో మార్పుల కోసం 18Lపైనే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.