News August 20, 2025
ఎయిర్ ఇండియాకు IOC హరిత ఇంధనం

ఎయిర్ ఇండియాకు సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్(SAF) సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) ఒప్పందం కుదుర్చుకుంది. హోటల్, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెలతో SAF ఉత్పత్తి చేపట్టేందుకు IOC సన్నాహాలు చేస్తోంది. హరియాణాలోని పానిపట్ రిఫైనరీలో ఏటా 35 వేల టన్నుల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయబోతున్నట్లు ఛైర్మన్ అర్విందర్ సింగ్ తెలిపారు. ఈ ఫ్యూయెల్‌తో వాయు కాలుష్యం తగ్గుతుందని వెల్లడించారు.
Similar News
News April 1, 2026
‘ఏఐ సెక్సువల్’.. ఇప్పుడు కొత్త ట్రెండ్!

ఆహారపు అలవాట్లు, ఇష్టాలే కాదు బంధాల్లోనూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే ‘ఏఐ సెక్సువల్’. లైంగిక విషయాల గురించి ఏఐతో పంచుకునే వాళ్లు వాళ్లను ‘ఏఐ సెక్సువల్’గా పేర్కొంటున్నారు. JoiAI అనే ప్లాట్‌ఫామ్ సర్వేలో 43% మంది లైంగిక సమస్యలపై, 37% మంది ఫ్లర్టింగ్/డేటింగ్‌పై, 33% సెక్స్ చాట్‌కు AIని వినియోగిస్తున్నట్లు తేలింది. గోప్యత, ఫ్రీగా మాట్లాడొచ్చనే ఏఐపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
News April 1, 2026
‘పోలవరం’ అకౌంట్లోకి డబ్బులు

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ కుమార్ సింగ్ రాష్ట్రానికి లేఖ రాశారు. ఆ డబ్బులు ప్రాజెక్ట్ అకౌంట్లో నేరుగా జమవుతాయని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. డ్యామ్ పనులు, నిర్వాసితుల పరిహారం కోసం రూ.1,508కోట్లు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర జలవనరులశాఖ కేంద్రాన్ని కోరింది. సమీక్షించి తాజాగా నిధులు రిలీజ్ చేసింది.
News April 1, 2026
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గతనెల దీనిపై రూ.115 పెంచిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడటంతో ధర పెరుగుతోంది.


