News August 23, 2024

ఐఫోన్ 16 సిరీస్ ధ‌ర‌లివే?

image

ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర (128GB) రూ.67,100, *16 ప్లస్ రూ.75,500, *16 ప్రో మోడల్ ధర (256GB) రూ.92,300, *16 ప్రో మ్యాక్స్ ధర రూ.1,00,700గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16, 16 ప్లస్ మోడల్స్ యాపిల్ A18 చిప్ సెట్‌తో రానున్నట్లు వివరాలు లీక్ అయ్యాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్‌తో, ఐఫోన్15 సిరీస్‌తో పోల్చితే ఈ ఫోన్ స్క్రీన్ సైజ్ 0.2 అంగుళాలు పెద్ద‌గా ఉండనుంది. ఈ సిరీస్ వచ్చేనెల విడుదలయ్యే అవకాశం ఉంది.

Similar News

News March 22, 2026

యుద్ధంతో అమెరికాకు ₹2.5లక్షల కోట్ల ఖర్చు

image

ఇరాన్‌పై యుద్ధంలో తగ్గేదే లేదని గాంభీర్యం ప్రదర్శిస్తున్న అమెరికాకు ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఈ యుద్ధం కోసం 21 రోజుల్లో $27 బిలియన్లు (₹2.5లక్షల కోట్లు) ఖర్చు చేసింది. పైగా మరో $200 బిలియన్లకు ట్రంప్ పార్లమెంటులో రిక్వెస్ట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే USకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఇప్పటికే US అప్పు 39 ట్రిలియన్ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ఠాన్ని తాకింది.

News March 22, 2026

ఖాతాల్లోకి డబ్బులు.. 3 రోజులే ఛాన్స్

image

TG: రైతుభరోసా పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటివరకు రైతుభరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్లికేషన్ ఫామ్‌తో పాటు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలి. పూర్తి వివరాలకు AEOలను సంప్రదించాలి.

News March 22, 2026

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌‌లో పాక్ టాప్

image

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో ఈసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఉగ్రదాడులతో నమోదైన మరణాలు 6% పెరిగి 1,139కు చేరాయి. 2013 తర్వాత ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పొరుగుదేశాలు.. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెన్షన్స్.. TTP, BLA సంస్థల దాడులు ఇందుకు కారణాలని రిపోర్ట్ తెలిపింది. కాగా గత ఏడాది ఈ ఇండెక్స్‌లో బుర్కినో ఫాసో, పాక్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.