News November 28, 2024

సరికొత్త ఫీచర్లతో ఐఫోన్ 17 ఎయిర్?

image

వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఐఫోన్ 17 ప్రో/మ్యాక్స్ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 5-6mm మందం, A19 ప్రో చిప్‌తో దీనిని రూపొందించనున్నట్లు సమాచారం. సింగిల్ స్పీకర్, 8జీబీ Ram, 48mp రేర్, 24mp ఫ్రంట్ కెమెరాలతో 5G e-Sim సాంకేతికతతో తయారవుతుందని టెక్ వర్గాలు పేర్కొన్నాయి. దీని ధర వేరియంట్‌ను బట్టి రూ.80 వేల నుంచి రూ.1.7 లక్షల వరకు ఉంటుందని అంచనా.

Similar News

News November 23, 2025

కామారెడ్డిలో కిలో చికెన్ రూ.240

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ ధర రూ.800, బోటి కిలో రూ.400, చికెన్ కిలో రూ.240- రూ.260, లైవ్ కోడి కిలో రూ.150గా నిర్ణయించారు. కార్తీక మాసం ముగియడంతో మాంసం అమ్మకాలు కాస్త పెరిగాయని వ్యాపారస్థులు తెలిపారు.

News November 23, 2025

పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

image

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 23, 2025

నేడు భారత్ బంద్

image

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.