News September 10, 2025

iPHONE 17 PRO: అమెరికాలో మనకంటే రూ.38వేలు తక్కువ!

image

ఐఫోన్ 17 సిరీస్ వివరాలు రివీల్ అవడంతో తొలిరోజే కొనేందుకు కొనుగోలుదారులు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇండియాతో పోల్చితే అమెరికాలో తక్కువ ధరలు ఉన్నాయి. ఐఫోన్ 17 PRO సిరీస్ ఫోన్లు ఇండియాలో ₹1,34,900 ఉండగా USAలో ₹96,870($1099), UAEలో ₹1,12,923 (AED 4,699), జపాన్‌లో ₹1,07,564లకు లభిస్తుంది. అయితే ఇండియాలోనే ఉత్పత్తి జరుగుతున్నా ధరల్లో ఎందుకింత వ్యత్యాసం ఉంటుందనే చర్చ జరుగుతోంది.

Similar News

News April 7, 2026

వాట్సాప్‌లో మీకు ఈ మెసేజ్ వచ్చిందా?

image

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు <<19512470>>‘సిమ్ బైండింగ్’<<>> అమలుకు వాట్సాప్ టెస్టింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘మీ ఫోన్‌లోని సిమ్‌ నంబర్‌ను తనిఖీ చేయడానికి అనుమతించండి’ అనే సందేశాలను యూజర్లకు పంపుతోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరలవుతోంది. డిసెంబర్ 31 తర్వాత రిజిస్టర్డ్ సిమ్ కార్డు ఫోన్‌లో లేకపోతే మెసేజింగ్ యాప్‌లు పనిచేయవు.
* మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News April 7, 2026

ఇంటర్.. ప్రత్యేకంగా అదనపు సబ్జెక్ట్ ఫలితాలు?

image

AP: ఇంటర్ విద్యలో సంస్కరణల్లో భాగంగా విద్యార్థులు 5 గ్రూప్ సబ్జెక్టులతోపాటు అదనంగా ఆరో సబ్జెక్టును ఎంపిక చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సబ్జెక్టు ఫలితాలను ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో పెట్టడం లేదా కాలేజీలకు పంపాలని అధికారులు యోచిస్తున్నారు. రెగ్యులర్ సబ్జెక్టుల రిజల్ట్స్ ఈ నెల 15-20 మధ్య రిలీజ్ చేసే <<19571013>>అవకాశం ఉంది<<>>.

News April 7, 2026

మాజీ మిస్ ఇండియా ఎర్త్ కిడ్నాప్?

image

మాజీ మిస్ ఇండియా ఎర్త్ (2019) విజేత సాయలీ సుర్వే తన నలుగురు పిల్లలతో కలిసి అదృశ్యం కావడం మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఆమె ఇస్లాం నుంచి తిరిగి హిందూ మతంలోకి మారిన విషయం తెలిసిందే. తన భర్త, అత్తమామలే ఆమెను కిడ్నాప్ చేశారని సాయలీ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. గతంలో ఆమె తన భర్తపై ‘లవ్ జిహాద్’, వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.