News October 1, 2024

CODపై ఐఫోన్ ఆర్డర్.. డెలివరీ బాయ్‌ని చంపేశాడు

image

ఐఫోన్‌పై పిచ్చి హత్యకు కారణమైంది. UPలోని చిన్‌హాట్‌‌కు చెందిన గజానన్ ఫ్లిప్‌కార్ట్‌లో COD(క్యాష్ ఆన్ డెలివరీ) ఆప్షన్‌ను ఎంచుకొని ₹1.5లక్షల విలువైన ఐఫోన్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ భారత్ సాహూకు డబ్బు ఇవ్వకపోగా అతడిని తన మిత్రుడితో కలిసి హతమార్చాడు. డెడ్‌బాడీని కాలువలో పడేశాడు. సాహూ కనిపించడం లేదని అతడి కుటుంబం మిస్సింగ్ కేసు పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Similar News

News January 1, 2026

సంతానోత్పత్తి తగ్గి కొరియాలో స్కూళ్ల మూత

image

పిల్లలు రాక ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతుండడం సాధారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇది షరా మామూలైంది. అయితే మన దగ్గర సదుపాయాలు, టీచర్ల లేమి, ప్రైవేటు స్కూళ్ల పోటీ కారణమైతే అక్కడ సంతానోత్పత్తి తగ్గడం దీనికి కారణం. దక్షిణ కొరియాలో గత కొన్నేళ్లలో 4008 GOVT స్కూళ్లు మూతపడ్డాయి. వీటిలో 3674 స్కూళ్లు ఎలిమెంటరీయే. ఈ దేశంలో సంతానోత్పత్తి రేటు 0.7కు పడిపోయింది. ఇతర దేశాలతో పోలిస్తే ప్రపంచంలో ఇదే అత్యల్పం.

News January 1, 2026

ఇతిహాసాలు క్విజ్ – 114 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
సమాధానం: రావణుడి సోదరి శూర్పణఖ. ఆమె భర్త పేరు విద్యుజ్జిహ్వుడు. అతను రావణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంతో, ఆగ్రహించిన రావణుడు సొంత బావ అని చూడకుండా సంహరించాడు. భర్తను కోల్పోయిన బాధ వల్లే శూర్పణఖ తిరుగుతూ అరణ్యంలో రాముడిని చూసి మోహించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 1, 2026

డ్రంకెన్ డ్రైవ్‌లో ఎంతమంది పట్టుబడ్డారంటే?

image

ఎంత చెప్పినా ఈసారి కూడా మందుబాబులు మారలేదు. న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 2,731 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్‌లో 928, ఫ్యూచర్ సిటీ‌లో 605 మంది తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వారందరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు రెగ్యులర్‌గానూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.