News November 27, 2024

IPLకు అనకాపల్లి జిల్లా యువకుడు.. నేపథ్యం ఇదే

image

అనకాపల్లి జిల్లా కుర్రాడు పైలా అవినాశ్‌ని IPL వేలంలో పంజాబ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అచ్యుతాపురం మండలానికి చెందిన అవినాశ్ సత్యారావు, నాగమణిల చిన్న కొడుకు. వీరది వ్యవసాయ ఆధారిత కుటుంబం కాగా అవినాశ్‌కు క్రికెట్‌ మీద ఉన్న మక్కువ చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసిన అవినాశ్ రంజీల్లో సత్తా చాటాడు. దీంతో పంజాబ్ ఫ్రాంచైజీ అతడిని రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తీసుకుంది.

Similar News

News December 9, 2024

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: బొత్స

image

తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైనట్లు MLC బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ నగరం లాసన్స్‌బే కాలనీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంట నష్టంపై వినతి పత్రం అందజేస్తామన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.

News December 9, 2024

విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్ 22న రద్దు

image

విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 22వ తేదీన రద్దు చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. సోరంటోలి చౌక్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 23న బనారస్-విశాఖ ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేశామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News December 9, 2024

పాడేరు: తల్లిదండ్రులపై కుమారుల దాడి

image

అల్లూరి జిల్లా పాడేరులో శనివారం రాత్రి పూడి శ్రీనివాస్, వరలక్ష్మి వారి కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాగానే పెద్ద కుమారుడు, కోడలు, చిన్న కుమారుడు ముగ్గురు కలిసి ఇనుప రాడ్లతో తలపై కొట్టారని, కోడలు గుండెపై తన్నిందని ఆరోపించారు. చుట్టుపక్కల వాళ్లు రాకపోతే తమను హత్య చేసేవారని ఆవేదన చెందారు. కుమార్తెకు డబ్బులు ఇస్తున్నారని ఆరోపిస్తూ దాడి చేశారని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.