News March 20, 2025
IPLకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం

ఉప్పల్ స్టేడియంలో IPL కోసం పనులు కొనసాగుతున్నాయి. లైటింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, వాష్ రూమ్స్ క్లీనింగ్, మంచినీటి సదుపాయంపై ఫోకస్ పెట్టినట్లు HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ తెలిపారు. 600-800 కార్మికులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గత ఐపీఎల్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామన్నారు. ఈ సారి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తున్నామని, స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు జగన్ మోహన్ తెలిపారు.
Similar News
News November 27, 2025
ములుగు జిల్లాలో ‘ఆమె’ ఓట్లే అధికం..!

ములుగు జిల్లాలోని 10 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,29,159 ఓటర్లు ఉండగా, అందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 7,461 మంది మహిళలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మంగపేటలో 19,913 మహిళా ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కన్నాయిగూడెంలో 5,085 మహిళా ఓటర్లు ఉన్నారు.
News November 27, 2025
పీరియడ్స్లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

పీరియడ్స్లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్స్మియర్, ఎండోమెట్రియల్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సోనోహిస్టరోగ్రామ్, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.
News November 27, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


