News March 29, 2025
IPLలో మొదటి వికెట్ తీసిన కాకినాడ కుర్రాడు

IPLలో కాకినాడకు చెందిన సత్యనారాయణరాజు మెయిడెన్ వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రాజు గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ వికెట్ తీసి పెవిలియన్కు పంపించాడు. చివరి ఓవర్లో స్లో బంతులతో ఆకట్టుకోవడంతో కెప్టెన్ హార్దిక్, రోహిత్ శర్మ, కిరాన్ పొలార్డ్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే మరిన్ని మ్యాచుల్లో అతడు రాణించాలని కోరుకుంటున్నారు.
Similar News
News November 21, 2025
సంగారెడ్డి: షూటింగ్ విజేతలకు కలెక్టర్ అభినందనలు

భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్(SGF) క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన షూటింగ్ పోటీలో సంగారెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రతిభ చాటిన వారిని కలెక్టర్ జితేష్ పాటిల్ అభినందించి, ధ్రువపత్రాలు అందజేశారు. జాతీయ స్థాయిలో జిల్లా టీం ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని షూటింగ్ జిల్లా కార్యదర్శి శేశ్వంత్ తెలిపారు.
News November 21, 2025
నవాబుపేట: కూతురి ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆత్మహత్య

నవాబుపేట మండలం హన్మసానిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య(40) కూతురు గౌతమి ఓ యువకుడిని ప్రేమించి అతనితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. గురువారం ఉదయం తన పొలంలోని చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 21, 2025
బెంగళూరులో రూ.7కోట్ల దోపిడీ.. చిత్తూరులో కారు

బెంగళూరు జేపీ నగర్లో బుధవారం పట్టపగలే దోపిడీ చేసిన కొందరు ఏపీ వైపు వచ్చారు. అక్కడి HDFC బ్యాంకు ఏటీఎంలో నగదు జమ చేసే వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు. రూ.7 కోట్ల నగదును నిందితులకు చెందిన ఇన్నోవా కారులోకి మార్చుకుని పారిపోయారు. చిత్తూరు(D) గుడిపాల మండలం చీలాపల్లి కూడలి పెట్రోల్ బంకు వద్ద కారు వదిలి పరారయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


