News December 28, 2025

IPLలో నో ఛాన్స్.. నేడు ₹కోట్ల సామ్రాజ్యం

image

టెస్ట్ అరంగేట్రంలో తొలి బంతికే వికెట్ తీసిన ఏకైక భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన నీలేశ్ కులకర్ణి జర్నీ అద్భుతం. SLతో తొలి మ్యాచ్‌లో 70ఓవర్ల పాటు వికెట్ దక్కకపోయినా, IPL ఛాన్స్ రాకున్నా వెనక్కితగ్గలేదు. ఓటమినే పాఠంగా భావించి International Institute of Sports&Management (IISM) ద్వారా దేశంలోనే తొలి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్లేయర్స్ మేనేజ్‌మెంట్‌లోనూ గెలవొచ్చని నిరూపించారు.

Similar News

News January 5, 2026

తండ్రైన క్రికెటర్ అంబటి రాయుడు

image

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. వారిద్దరితో దిగిన సెల్ఫీ ఫొటోను రాయుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా విద్యను రాయుడు 2009లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగుల్లో ఆడుతూ క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు.

News January 5, 2026

అతి త్వరలోనే పెన్షన్ల పెంపు: మంత్రి

image

TG: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అతి త్వరలోనే పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు బస్సుల్లో త్వరలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి బధిర విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా దివ్యాంగుల పెన్షన్లను ₹4,016 నుంచి ₹6వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

News January 5, 2026

ఐశ్వర్యానికి కారకుడు శివుడా?

image

శివుడిని వైరాగ్యానికి మూర్తిగా భావిస్తాం. కానీ ఆయనే సకల సంపదలకు మూలమైన ‘ఐశ్వర్యేశ్వరుడు’. కుబేరుడికి ఉత్తర దిక్పాలకుడిగా, సంపదలకు అధిపతిగా ఉండే శక్తిని ప్రసాదించినది ఆ పరమశివుడే. ఆయన భక్తుల దారిద్ర్యాన్ని హరించి శుభాలను చేకూర్చే మంగళకారుడు. మనసు నిండా భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగి భోగభాగ్యాలు చేకూరుతాయి. అందుకే శివుణ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు.