News November 26, 2024

IPL: కాకినాడ కుర్రాడికి సువర్ణావకాశం

image

ఐపీఎల్లో ముంబై టీమ్‌ కొనుగోలు చేసిన కాకినాడ కుర్రాడు సత్యనారాయణరాజు రోహిత్, బుమ్రా, హార్దిక్, బోల్ట్ వంటి స్టార్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నారు. వారి అనుభవాలను తెలుసుకుని కెరీర్‌ను పటిష్ఠం చేసుకునే సువర్ణావకాశం మన జిల్లా కుర్రాడికి దక్కింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే TEAM INDIA ఎంట్రీకి ఇదే తొలి అడుగు అవుతుందనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్..

Similar News

News April 10, 2026

నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవాలకు ఎమ్మెల్యే బత్తుల

image

రాజానగరంలో శ్రీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 16, 17వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ గవర్నర్‌కు దుశ్శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.

News April 9, 2026

చాగల్లు: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి 

image

విద్యుత్ ఘాతంతో బొంతు వంశీ (25) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల సమాచారం.. చాగల్లు మండలం చిక్కాలపాలెం వద్ద కొబ్బరి ఆకులు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2026

ప్రకృతి వ్యవసాయంతోనే భూసార రక్షణ: కలెక్టర్

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో APCNF ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని కోరారు. పంటల వైవిధ్యం పాటించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని శిక్షణ పొందుతున్న వారికి దిశానిర్దేశం చేశారు.