News March 22, 2025
IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నారు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.
Similar News
News March 25, 2025
వేసవిలో చెమట వాసన వేధిస్తోందా?

వేసవిలో శరీరం నీటిని ఎక్కువగా కోల్పోయి చెమట విపరీతంగా వస్తుంది. దీంతో చెడు వాసన వచ్చి అసౌకర్యానికి గురిచేస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంలో నిమ్మకాయ రసం, పెరుగు తప్పనిసరి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాతో పోరాడేందుకు సాయపడతాయంటున్నారు. రోజ్ వాటర్ లేదా యూకలిప్టస్ ఆయిల్ కలిపిన నీటితో స్నానం చేస్తే చెమట వాసన తగ్గుతుందని సూచిస్తున్నారు.
News March 25, 2025
నంద్యాల: ‘అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి’

నంద్యాల జిల్లాలోని 15, 77, 936 రేషన్ కార్డుదారుల్లో ఇప్పటి వరకు 14,04,647 మంది ఈకేవైసీ చేయించుకున్నారని, మిగిలిన వారు వెంటనే చేయించుకోవాలని జేసీ విష్ణుచరణ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. 1,73,289 మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదని చెప్పారు. కార్డుదారులందరూ తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పాస్ మిషన్ల ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేయించుకోవాలని సూచించారు.
News March 25, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 88 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకొని వచ్చారు. వేరుశనగలు 359 క్వింటాళ్లు రాగా గరిష్ఠ ధర రూ.6,411, కనిష్ఠ ధర రూ.5,100 లభించింది. మక్కలు 902 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.2,281 కనిష్ఠ ధర రూ.1,791 లభించింది. ఆముదాలు 10 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,300, కనిష్ఠ ధర రూ.5,870 లభించింది.