News March 22, 2025
IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నాడు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.
Similar News
News December 10, 2025
ధాన్యం కొనుగోలులో పారదర్శకత అవసరం: జేసీ

ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, రవాణా, కొలతలు, చెల్లింపులు వంటి అన్ని అంశాల్లో పారదర్శకత ఉండాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని.. ప్రతి సమాచారం రైతులకు, మీడియాకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
News December 10, 2025
రాజమండ్రి: విద్యాభివృద్ధిలో తరగతి పరిశీలన కీలకం- DEO

పాఠశాల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో దోహదపడే తరగతి పరిశీలన చిత్తశుద్ధితో నిర్వహించాలని DEO కె.వాసుదేవరావు సూచించారు. గత 2రోజులుగా స్థానిక దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న సీఆర్ఎంటీలు, ఉపాధ్యాయుల “టీచ్ టూల్ అబ్జర్వేషన్ శిక్షణ” తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
News December 10, 2025
రాజమండ్రిలో ఈనెల 12న జామ్ మేళా!

రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని ఆమె సూచించారు.


