News April 1, 2025
IPL బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి: BHPL ఎస్పీ

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, IPL బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే IPL క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించే వారిపై పోలీస్ నిఘా ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News April 6, 2025
కలిదిండి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఈ నెల 3న మద్యం తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు. మద్యం మానేయాలని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై 4వ తేదీన ఎలుకల మందుని నీళ్లలో కలుపుకుని తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
News April 6, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.184లు ఉండగా, బ్రాయిలర్ స్కిన్ లెస్ కిలో రూ.210గా ఉంది. లేయర్ మాంసం కిలో రూ.178లకు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800 నుంచి 900 వరకు విక్రయిస్తున్నారు. మీ ప్రాంతాలలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News April 6, 2025
కాంగ్రెస్ ఉదారత వల్లే ఈ పరిస్థితి: కంగనా రనౌత్

వక్ఫ్ బోర్డుల్లో నిబంధనల ఉల్లంఘనకు కాంగ్రెస్ ఉదారతే కారణమని నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. భారీ స్థాయిలో జరిగిన భూకబ్జాలకు వక్ఫ్ సవరణ బిల్లు పరిష్కారం చూపుతుందన్నారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో భారీ కుట్ర ఉందని ఆరోపించారు. దాంతో ఇప్పటికీ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఏ ఒక్క వ్యక్తి, కమ్యూనిటీ లేదా సంస్థ చట్టం కంటే ఎక్కువ కాదని పేర్కొన్నారు.