News March 29, 2025
IPL: మరోసారి ముంబై టీంలో కాకినాడ కుర్రాడికి చోటు

IPLలో నేడు MI vs GT మ్యాచ్ మరికాసేపట్లో జరుగనుంది. కాకినాడకు చెందిన క్రికెటర్ పీవీ సత్యనారాయణరాజు మరోసారి జాక్ పాట్ కొట్టాడు. అతడికి మరోసారి MI అవకాశం కల్పించింది. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో MI తరఫున తుది జట్టులో అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో సత్యనారాయణ రాజు అద్భుతంగా రాణించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.
*ALL THE BEST సత్యనారాయణ రాజు*
Similar News
News October 19, 2025
యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు: SI

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసి, మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై కారంచేడు SI ఖాదర్ బాషా శనివారం కేసు నమోదు చేశారు. SI వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన ఓ యువతిని వరసకు బావ అయ్యే యువకుడు వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడు. యువకుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసి యువకుడి తల్లిదండ్రులను ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
News October 19, 2025
బౌద్ధుల దీపావళి.. ఎలా ఉంటుందంటే?

దీపావళి బౌద్ధుల పండుగ కానప్పటికీ వజ్రయాన శాఖకు చెందినవారు దీన్ని వేడుకగా జరుపుకొంటారు. నేపాల్‌లోని ‘నేవార్’ ప్రజలు ‘తిహార్’ పేరుతో 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ స్వేచ్ఛ కోసం ఏ దేవతనైనా ఆరాధించవచ్చనే ఆచారం ప్రకారం వీరు లక్ష్మీదేవిని, విష్ణువును తమ దైవాలుగా భావించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా లక్ష్మీదేవిని ప్రార్థించడం ద్వారా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.
News October 19, 2025
హయాగ్రీవాచారి గ్రౌండ్స్‌లో 121 క్రాకర్స్ స్టాళ్లు

బాలసముద్రంలోని హయాగ్రీవాచారి(కుడా) గ్రౌండ్స్‌లో దీపావళి సందర్భంగా క్రాకర్స్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా దాదాపు 121 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ క్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజీజ్ మీర్జా తెలిపారు. ఎలాంటి అనర్థాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. చుట్టుపక్కల పొగ తాగడం నిషేధమని చెప్పారు.