News March 29, 2025

IPL: మరోసారి ముంబై టీంలో కాకినాడ కుర్రాడికి చోటు

image

IPLలో నేడు MI vs GT మ్యాచ్ మరికాసేపట్లో జరుగనుంది. కాకినాడకు చెందిన క్రికెటర్ పీవీ సత్యనారాయణరాజు మరోసారి జాక్ పాట్ కొట్టాడు. అతడికి మరోసారి MI అవకాశం కల్పించింది. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో MI తరఫున తుది జట్టులో అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో సత్యనారాయణ రాజు అద్భుతంగా రాణించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.
*ALL THE BEST సత్యనారాయణ రాజు*

Similar News

News April 20, 2025

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖ నగర ప్రజలు లా అండ్ ఆర్డర్,క్రైమ్, దొంగతనాలు, ట్రాఫిక్ సమస్యలు,పలు పోలీస్ సంబంధిత సమస్యలపై రేపు ఉదయం 10 గంటల నుంచి వినతులు సమర్పించవచ్చన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అయితే అంబేడ్క‌ర్ జయంతి కారణంగా గత సోమవారం పీజిఆర్ఎస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

News April 20, 2025

ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

image

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.

News April 20, 2025

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.

error: Content is protected !!